గురుకుల పాఠశాలలో విషాదం..విద్యార్థి మృతి

ఖమ్మం, పెన్ పవర్, సెప్టెంబర్ 9: ఉదయం ఆరు గంటలకే గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. రోజువారీ వ్యాయామంలో భాగంగా మైదానంలో వ్యాయామం చేస్తున్న 8వ తరగతి విద్యార్థి సాత్విక్ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఉదయం వరకు తమ కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడని భావించిన తల్లిదండ్రులకు కొద్దిసేపటికే అతడు మృతి చెందాడనే వార్త తెలియడంతో వారి గుండెలు పగిలిపోయాయి. రఘునాథపాలెం మండలంలోని బాలుర బీసీ గురుకుల పాఠశాలలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన సలిగంటి...