గ్రామసభలో నీటి సెగ
నీటి కష్టాలపై సర్పంచ్‌ను నిలదీసిన మహిళలు గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 2: గార్ల మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో తాగునీటి సమస్యపై మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా, ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ తదితర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన గ్రామసభకు హాజరైన పలు వార్డుల మహిళలు గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని సర్పంచ్ బానోత్ పార్వతి నాయక్‌ను నిలదీశారు.రోజుల తరబడి నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు...