ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 5: గార్ల మండల కేంద్రంలోని స్థానిక నిర్మలా హైస్కూల్‌లో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ జెన్సి మాట్లాడుతూవిద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించడంతోపాటు వారి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తూ ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ విద్యార్థులు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సందడి...