ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. ఆకట్టుకున్న చిన్నారుల వేశధారణ
గార్ల పెన్ పవర్ సెప్టెంబర్ 4: శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని గార్ల మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులను శ్రీకృష్ణుడు గోపిక సత్యభామ వేషధారణలో ముస్తాబు చేశారు కృష్ణుడి వేషంలో వేణువు చేతబట్టి నెమలి పింఛం ధరించిన చిన్నారులు వేషధారణలో ముస్తాబైన బాలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కృష్ణుడి లీలలను తలపించే వారి సందడి భక్తులను ఆకట్టుకుంది. అనంతరం...