చర్చిలో విభేదాలు.. ప్రత్యేకంగా ప్రార్థనా మందిరం
శాంతియుత వాతావరణంలో ఆరాధనలు కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని విశ్వాసుల విజ్ఞప్తి చీరాల, సెప్టెంబర్ 24, (పెన్ పవర్) : మండలంలోని సాల్మన్ సెంటర్ బేర్ కాంపౌండ్‌లోని చర్చి నిర్వహణకు సంబంధించి కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో కొందరు విశ్వాసులు ప్రత్యేకంగా ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసుకుని ఆరాధనలు కొనసాగిస్తున్నారు. సమస్యను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు జైసన్ మాట్లాడుతూ.. చర్చి నిర్వహణకు సంబంధించి కొన్ని అనివార్య కారణాలతో విభేదాలు తలెత్తాయని తెలిపారు. ఆదివారం ఆరాధన సమయంలో...