చీకటి పడకముందే గణేశ్ నిమజ్జనాలు పూర్తి చేయాలి
యువత అత్యుత్సాహానికి దూరంగా ఉండాలి.. భద్రతా నిబంధనలు పాటించాలి : ఎస్పీ బిందు మాధవ్ కాకినాడ జిల్లా, పెన్‌పవర్ ప్రతినిధి, సెప్టెంబర్ 22: తుఫాను ప్రభావం నేపథ్యంలో గణేశ్ నిమజ్జనాల సందర్భంగా యువత, ఉత్సవ కమిటీలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ సూచించారు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో జిల్లాలో నిర్వహించే గణేశ్ నిమజ్జన కార్యక్రమాలను సాయంత్రం చీకటి పడకముందే పూర్తి చేసుకోవాలని కోరారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిమజ్జనాలను ముందుగానే ప్రారంభించి, ఎలాంటి ఆలస్యం లేకుండా ముగించుకోవాలని...