చేనేత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే కొండయ్య
చీరాల, సెప్టెంబర్ 22 (పెన్ పవర్): చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చీరాల ఎమ్మెల్యే కొండయ్య హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం చీరాలలో ఎమ్మెల్యేను ఉమ్మడి ప్రకాశం జిల్లాల చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ దామర్ల శ్రీకృష్ణ ఆధ్వర్యంలో చేనేత సంఘాల ప్రతినిధులు కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. నేతన్న సేవ పథకంపై ప్రత్యేక దృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో...