జనసేన సభ్యత్వంతో రూ.5 లక్షల ప్రమాద బీమా
చింతపల్లి, పెన్ పవర్, సెప్టెంబర్ 15:జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న కంచర్ల హరికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన కుటుంబానికి పార్టీ సభ్యత్వం ద్వారా లభించే ప్రమాద బీమా పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ మేరకు రూ.5 లక్షల చెక్కును పాడేరు జనసేన పార్టీ ఇన్చార్జి, రాష్ట్ర జానపద కళలు మరియు సృజనాత్మక అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా గంగులయ్య మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ప్రమాద...