జాండ్రపేట, నవాబ్ పేట అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ ఉత్సవం

పౌష్టికాహారం, అంగన్వాడీ సేవలపై మహిళలకు అవగాహన ప్రీస్కూల్ కార్యక్రమాలపై తల్లులకు వివరించిన సిబ్బంది చీరాల, సెప్టెంబర్ 30 :  జాండ్రపేట,  నవాబ్ పేట అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గర్భిణులు, బాలింతలు, మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు గల చిన్నారులు, వారి తల్లులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, పోషకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై తల్లులకు అవగాహన కల్పించారు. అలాగే మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు...