జెండా గణేష్ ఉత్సవాల్లో ఘనంగా అన్నసంతర్పణ
చీరాల, సెప్టెంబర్ 25 : జాండ్రపేటలో జెండా గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించే జెండా గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది కూడా వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జెండా గణేష్ స్వామివారిని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి భక్తులకు స్వయంగా అన్నసంతర్పణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథుని దర్శించుకుని అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గణపతి ఆశీస్సులతో ప్రతి...