‘టిడబ్ల్యూజేఎఫ్’ ఆధ్వర్యంలో పులిహోర, మంచినీటి సేవలు
ఖమ్మం, పెన్ పవర్ సెప్టెంబర్ 23 : గణేషుడిని నవరాత్రి పాటు భక్తుల పూజలు, మంత్రోచ్ఛారణలు, భక్తి శ్రద్ధలతో కొలువుదీరిన విఘ్నేశ్వరుడు ఘనంగా వీడ్కోలు అందుకున్నారు. ఖమ్మం నగరంలోని నలుమూలల నుంచి వివిధ ఆకృతుల్లో అలంకరించబడిన గణనాథుల విగ్రహాలు భక్తుల కోలాహలం, డప్పు వాయిద్యాల మోత, భక్తుల నృత్యాల నడుమ నిమజ్జనానికి తరలివెళ్లాయి. చల్లటి చినుకులు కురుస్తున్నా భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. వర్షపు చినుకులను సైతం విఘ్నేశ్వరుడి ఆశీస్సులుగా భావిస్తూ భక్తులు భక్తిపారవశ్యంలో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ వాహనాలపై వైభవంగా...