డీజేల హోరు.. జనం బేజారు
గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 1: పండుగలు, వివాహాలు, ఊరేగింపులు, ఇతర శుభకార్యాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న డీజేల మోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిమితికి మించి శబ్దాన్ని పెంచి డీజేలు నిర్వహిస్తుండటంతో వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాత్రి వేళల్లోనూ డీజేలను భారీ శబ్దంతో నిర్వహించడం వల్ల ప్రశాంతతకు భంగం కలుగుతోందని పలువురు పేర్కొంటున్నారు.సాధారణంగా 70 నుండి 85 డెసిబెల్స్ వరకు ఉండే ధ్వని మానవ చెవులకు సురక్షితం కాగా, ప్రస్తుతం వాడుతున్న...