తాగునీటి సమస్యపై డేగల నాగేంద్ర తక్షణ స్పందన
పాతమొగలిపాలెం గ్రామానికి డీఎన్‌ఎఫ్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరా కాజులూరు,పెన్ పవర్,సెప్టెంబర్ 21: ప్రపంచంలో ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ, ప్రజలకు కనీసం తాగునీరు అందించలేని పరిస్థితి రావడం బాధాకరమని రామచంద్రపురం నియోజకవర్గ జనసేన యువ నేత డాక్టర్ డేగల నాగేంద్ర అన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని కొంతమంది మీడియా ప్రతినిధులు, స్థానిక కూటమి నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో డీఎన్‌ఎఫ్ ఫౌండేషన్...