తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అనవసరంగా బయటకు రావొద్దు.. గొర్లె వీరవెంకట్
గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 24:తుఫాను తీరం దాటుతున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జనసేన నాయకుడు గొర్లె వీరవెంకట్ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌ను అనవసరంగా వినియోగించకుండా అత్యవసర సమయాలకు అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే అధికారులు, పోలీస్ శాఖకు సమాచారం అందించాలని తెలిపారు. జనసేన కార్యకర్తలు, జనసైనికులు ప్రజలకు అండగా నిలిచి అవసరమైన సహాయక చర్యల్లో పాల్గొనాలని...