నులిపురుగుల నిర్మూలనలో భాగంగా 6,857 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు

వేటపాలెం, సెప్టెంబర్ 25 :  జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వేటపాలెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో శుక్రవారం చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పరిధిలో మొత్తం 7,182 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించాల్సి ఉండగా, 6,857 మంది పిల్లలకు మాత్రలు పంపిణీ చేసినట్లు వైద్యాధికారిణి డాక్టర్ టి. ప్రియాంక తెలిపారు. వివిధ కారణాలతో మాత్రలు తీసుకోలేకపోయిన మిగిలిన...