నెట్‌వర్క్ సమస్యతో పెన్షన్ దరఖాస్తుదారుల అవస్థలు
గూడెంకొత్తవీధి, సెప్టెంబర్ 8: లకవరపుపేట పంచాయతీలోని మారుమూల గ్రామాలైన ఎర్రచెరువు, పోతురాజుగుమ్మలు, లింగవరం, గరికబంధ, నేరేళ్లబంధ గ్రామాల నుంచి వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు మంగళవారం సచివాలయాలకు తరలివచ్చారు. అయితే నెట్‌వర్క్, సర్వర్ సమస్యల కారణంగా దరఖాస్తులు చేసుకోలేక ఉదయం నుంచి సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి నెట్‌వర్క్, సర్వర్ సమస్యలను పరిష్కరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ కంకిపాటి రామారావు, టీడీపీ...