నేర స్థలంలోనే శాస్త్రీయ ఆధారాల సేకరణకు మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్
బాపట్ల, సెప్టెంబర్ 22 (పెన్ పవర్): బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనాన్ని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. నేర స్థలంలోనే శాస్త్రీయ ఆధారాలను సేకరించి, దర్యాప్తును మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. హత్య, అత్యాచారం, దోపిడీ వంటి కీలక కేసుల్లో నేర స్థలానికి వెంటనే చేరుకుని ఆధారాలను సేకరించడం ద్వారా దర్యాప్తును వేగవంతం చేయవచ్చన్నారు. శాస్త్రీయ ఆధారాల...