పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో వైద్య పరీక్షలు, సన్మానం చీరాల, సెప్టెంబర్ 30 : చీరాల మండలం తోటవారిపాలెం స్వర్ణ పంచాయతీ కార్యాలయంలో బుధవారం “స్వచ్ఛతా హీ సేవా” కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గ్రామ పారిశుద్ధ్య పరిరక్షణలో వారు అందిస్తున్న సేవలను గుర్తించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులను ఎవరూ తక్కువగా చూడరాదన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో...