పాలకవర్గానికి ఘన వీడ్కోలు.. సన్మానాల సందడి

ఐదేళ్ల పదవీకాలానికి ముగింపు పలికిన కాజులూరు మండల పరిషత్‌ పాలకవర్గం సాదాసీదాగా తుది సర్వసభ్య సమావేశం.. అభివృద్ధి పనులపై సమీక్ష కాజులూరు, పెన్‌పవర్‌, సెప్టెంబర్‌ 17: కాజులూరు మండల పరిషత్‌ పాలకవర్గానికి ఘన వీడ్కోలు పలికారు. ఐదేళ్ల పదవీకాలం ఈ నెల 23తో ముగియనున్న నేపథ్యంలో గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో తుది సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం ఎంపీపీ మాత భారతి దంపతులతో పాటు జెడ్పీటీసీ, వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీలను మండల పరిషత్‌ సభ్యులు, రాజకీయ నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది...