పోషకాహార లోపాలను అధిగమించేందుకు పోషన్ మాసం
కాజులూరు, పెన్‌పవర్, సెప్టెంబర్ 9: గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను గుర్తించి, సకాలంలో తగిన పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పోషణ్ మాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తాళ్లరేవు ఐసీడీఎస్ ప్రాజెక్టు , సీడీపీవో వై.శ్రీదేవి అన్నారు. కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం ఐసీడీఎస్ సెక్టార్‌లో బుధవారం సీడీపీవో వై.శ్రీదేవి అధ్యక్షతన పోషణ్ మాసం–2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘మన అంగన్‌వాడీ.. మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సూపర్మావైజర్ కె.రమణకుమారి ట్లాడుతూ ప్రతి నెలా అంగన్‌వాడీ...