పోషణ మాసంలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం
పౌష్టికాహారంతో పిల్లలు, తల్లుల్లో ఆరోగ్యం–శక్తి పెంపు వేటపాలెం, సెప్టెంబర్ 30: వేటపాలెం ఐసీడీఎస్ ప్రాజెక్టు దేశాయిపేట సెక్టార్ పరిధిలోని కేపాల్ కాలనీ, విజయనగర్ కాలనీలలో పోషణ మాస ఉత్సవాల్లో భాగంగా అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెక్టార్ సూపర్‌వైజర్ సజ్జా లీలావతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహార రకాలు, వాటిని పిల్లలు, తల్లులు ఎంత మోతాదులో తీసుకోవాలి, వాటి ద్వారా లభించే పోషక విలువలు, శరీరానికి అందే శక్తి తదితర...