ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
చీరాల, సెప్టెంబర్ 25 : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం శుక్రవారం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హాజరై ప్రజల నుంచి స్వయంగా సమస్యలపై వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 17 అర్జీలు అందగా, వాటిలో ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణాలకు సంబంధించి 8 అర్జీలు, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) కోసం 2 అర్జీలు, ఇతర సమస్యలకు సంబంధించి...