ప్రధానోపాధ్యాయురాలు కె. సుమిత్రాకు ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారం

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 5:రింతాడ జి.పి.డబ్ల్యూహెచ్ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. సుమిత్రా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పురస్కారం అందుకున్నారు. పాడేరులో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి. నిశాంతి చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం అందుకుని దుశ్శాలువాతో సన్మానం పొందారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. కార్యక్రమంలో వంపూరు గంగులయ్య, గిడ్డి ఈశ్వరి, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.