ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
ఇబ్రహీంపట్నం, పెన్ పవర్, సెప్టెంబర్ 11: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నం నందు అర్థశాస్త్ర అధ్యాపకుడికి 2026 సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాధిక అధ్యక్షతన కళాశాలలో ఉత్తమ ఉపాధ్యాయుడిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాలకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం చాలా సంతోషదాయకమని, ఈ అవార్డు రావడం వల్ల కళాశాల రాష్ట్రస్థాయిలో పేరుపొందిందని ఆమె కొనియాడారు. ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావడానికి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని,...