ఫార్మర్ ఐడీ ఉంటేనే రైతు పథకాల ప్రయోజనాలు
గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్: 13 రైతు సంక్షేమ పథకాలు, వ్యవసాయ సేవలను మరింత సులభంగా అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడీ నమోదు ప్రక్రియ కొనసాగుతోందని వ్యవసాయ విస్తరణ అధికారి మేఘన అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గార్ల మండల పరిధిలోని ముల్కనూరు రైతు వేదిక వద్ద రైతుల వివరాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో రైతులకు అందించే వివిధ సంక్షేమ పథకాలు,...