బాధిత కుటుంబానికి భరోసాగా నిలిచిన కీర్తి పూర్ణచంద్రరావు

చీరాల, సెప్టెంబర్ 24, (పెన్ పవర్): వేటపాలెం మండలం, చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని కొణిజేటి చేనేతపురి కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని టీడీపీ నాయకులు గురువారం పరామర్శించారు. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య,  ఆదేశాల మేరకు చల్లారెడ్డిపాలెం పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు కీర్తి పూర్ణచంద్రరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రమాదంలో జరిగిన నష్టాన్ని వివరంగా తెలుసుకున్నారు. ఎమ్మెల్యే తరఫున బాధిత కుటుంబానికి రూ.10 వేల నగదు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కీర్తి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. ప్రమాదం...