బాల వినాయకునికి మకర తోరణం సమర్పణ
నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం మున్సిపాలిటీలో 5 రోడ్ల జంక్షన్ వద్ద కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ బాల వినాయక స్వామివారికి ఆదివారం ఘనంగా వెండి మకర తోరణాన్ని బహుకరించారు. ఆలయ కమిటీ మరియు భక్తుల సహాయ సహకారాలతో సుమారు 3 కేజీల 500 గ్రాముల వెండితో ఈ ప్రతిష్టాత్మకమైన మకర తోరణాన్ని తయారు చేయించారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి చేతుల మీదుగా ఈ తోరణాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేశారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించి...