భక్తిశ్రద్ధలతో జెండా గణేష్ మహోత్సవాలు

చీరాల, సెప్టెంబర్ 28 : జాండ్రపేటలో జెండా గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే జెండా గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథునికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ హాజరై గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు....