భక్తిశ్రద్ధలతో సామూహిక అనంతపద్మనాభ స్వామి వ్రతం

వేటపాలెం, సెప్టెంబర్ 25 : వేటపాలెంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 14వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం సామూహిక అనంతపద్మనాభ స్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అనంతపద్మనాభ స్వామివారిని భక్తితో పూజించి నోములు ఆచరించారు. ప్రత్యేక అలంకరణలు ఆకట్టుకున్నాయి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. అనంతపద్మనాభ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు ద్వాదశ లింగాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక శివలింగాల అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది....