భారీ వర్షాలు.. రేపు పాఠశాలలకు సెలవు
స్టాఫ్ రిపోర్టర్ పాడేరు, పెన్ పవర్, సెప్టెంబర్ 24:భారీ వర్షాలు, వరదలు, కొండచరియల ముప్పు నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా సెప్టెంబర్ 25న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు.రెసిడెన్షియల్ పాఠశాలలకు ఈ సెలవు వర్తించదని స్పష్టం చేశారు. అక్కడ విద్యార్థుల భద్రత, పర్యవేక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని కలెక్టర్ కోరారు.