భారీ వర్షాలు, వరదలపై ఐటీడీఏ అప్రమత్తం

చింతూరు, పెన్ పవర్, సెప్టెంబర్ 24: చింతూరు డివిజన్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభం నోఖ్వాల్, ఐఏఎస్‌ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గురువారం వీఆర్‌పురం తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు, రహదారులు, వంతెనలు, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలపై సమీక్షించారు. ప్రతి మండలంలో అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌ల ద్వారా సమాచారం సేకరించి అత్యవసర...