భారీ వర్షాల నేపథ్యంలో నేడు విద్యాసంస్థలకు సెలవు
కాకినాడ, పెన్ పవర్,సెప్టెంబర్ 23: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు బుధవారం (23వ తేదీ) ఒకరోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు.విద్యార్థులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో వర్షాల పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.