భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

24×7 జిల్లా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు.. నిరంతర పర్యవేక్షణ కాకినాడ, పెన్ పవర్,సెప్టెంబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు కాకినాడ కలెక్టరేట్‌లో 24×7 జిల్లా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో వర్షపాతం, రిజర్వాయర్లు, చెరువులు, డ్రైనేజీలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, రహదారుల పరిస్థితిని సంబంధిత శాఖల...