భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:ఆర్.వి. నగర్ అటవీ రేంజ్ అధికారి
గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 23:ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గూడెంకొత్తవీధి మండలం ఆర్.వి. నగర్ అటవీ రేంజ్ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ రేంజ్ అధికారి మణికృష్ణ సూచించారు.దుచ్చరపాలెం గ్రామం నుంచి సప్పర్ల రైన్ గేజ్ వరకు, గూడెం గ్రామం నుంచి మండపల్లి గ్రామం వరకు ఉన్న రిజర్వు అటవీ ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా చెట్లు విరిగి పడే అవకాశం ఉందని తెలిపారు. అటవీ రహదారులు, చెట్ల సమీపంలో అనవసరంగా నిలవకూడదని సూచించారు. ఎక్కడైనా...