మరణంలోనూ జీవించే మహోన్నత నిర్ణయం
శరీర, అవయవ దానానికి నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాస్ అంగీకారం నర్సీపట్నం, పెన్ పవర్, సెప్టెంబర్ 16: పోలీస్ అధికారిగా శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉంటూనే సమాజ సేవ పట్ల తన బాధ్యతను చాటుతూ నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు శరీర, అవయవ దానానికి ముందుకు వచ్చారు. అనుకోకుండా బ్రెయిన్ డెత్ సంభవిస్తే అవయవాలను, సహజ మరణం పొందితే పార్థివదేహాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైద్య కళాశాలకు అప్పగించేలా తన అంగీకార పత్రాన్ని బుధవారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అఖిలభారత శరీర, అవయవదాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్...