మీడియా రంగంలో తనదైన ముద్ర వేస్తున్న సీనియర్ పాత్రికేయులు రెహమాన్

కాజులూరు, పెన్ పవర్ సెప్టెంబర్ 30: మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవంతో సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక అంశాలను తనదైన శైలిలో ప్రజలకు చేరువ చేస్తున్న సీనియర్ పాత్రికేయులు, ఆర్‌వీఎంసీ యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకులు రెహమాన్‌ తన ప్రత్యేక కథనాలతో ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన రాజకీయ పరిణామాలను విశ్లేషణాత్మకంగా వివరిస్తూనే, గ్రామీణ ప్రాంతాల్లోని పురాతన ఆలయాలు, వాటి విశిష్టత, చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక విశేషాలను ప్రజలకు పరిచయం చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. రెహమాన్‌ నిర్వహించే ఇంటర్వ్యూలలో విషయ...