యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి

చీరాల, సెప్టెంబర్ 25 :  మేరా యువ భారత్–గుంటూరు ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను శుక్రవారం చీరాల సెయింట్ మార్క్ లూథరన్ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కార్డ్స్ ఎన్జీఓ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ దేశానికి అందించిన సేవలను, ఆయన ఆలోచనా విధానాన్ని వివరించారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని వివరించి, యువత దేశ నిర్మాణంలో బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని...