రింతాడలో ఓటర్ల జాబితా ప్రచురణపై గ్రామసభ

గూడెంకొత్తవీధి, పెన్ పవర్ ,సెప్టెంబర్ 2: పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా ప్రచురణకు సంబంధించి రింతాడ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు గ్రామసభ నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్ తెలిపారు.ఈ గ్రామసభకు ప్రజాప్రతినిధులు, పీసా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సభ్యులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.ఓటర్ల జాబితా ప్రచురణలో ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉన్నట్లయితే...