రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త

  దుర్వాసనతో ప్రయాణికుల అవస్థలు వ్యాధుల భయంతో స్థానికుల ఆందోళన ఖమ్మం, పెన్ పవర్, సెప్టెంబర్ 4: ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ జాతీయ రహదారిపై చెత్త కుప్పలు పేరుకుపోవడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి పక్కనే ఇళ్లలోని చెత్త, దుకాణాల వ్యర్థాలు, ఫంక్షన్లలో మిగిలిన వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తుండటంతో పరిసర ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారింది.ప్రతిరోజూ వందలాది మంది రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై చెత్త పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు ముక్కు...