వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కొండయ్య దృష్టి

చీరాల, సెప్టెంబర్ 23, (పెన్ పవర్) : చీరాల నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రత్యేక దృష్టి సారించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలతో మమేకమవుతూ పట్టణంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. చీరాలను సుందర నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల అవసరాలను తెలుసుకుంటూ, ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతుల పనులపై సంబంధిత అధికారులకు సూచనలు చేస్తున్నారు. పనుల నాణ్యత, వేగం విషయంలో కాంట్రాక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ,...