వర్షాలు, బలమైన గాలులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్
బాపట్ల, సెప్టెంబర్ 24, (పెన్ పవర్) : బంగాళాఖాతంలో ఏర్పడిన లోతైన అల్పపీడనం ప్రభావంతో బాపట్ల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీనమైన ఇళ్లు, మిద్దెల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్ర తీర ప్రాంతాలు, వాగులు, చెరువులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. రైతులు...