విద్యా కమిటీల్లో టీడీపీ మద్దతుదారుల హవా
పర్చూరు, సెప్టెంబర్ 29 : పాఠశాల విద్యా కమిటీల ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. పర్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా 237 పాఠశాల గాను ఒక పాఠశాల లో ఎన్నిక వాయిదా పడగా 231 మంది తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలోని పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, చిన్నగంజాం, ఇంకొల్లు, మార్టూరు మండలాల్లోని పాఠశాలల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు గణనీయ సంఖ్యలో గెలుపొందారు. పర్చూరు మండలంలో 45 పాఠశాలలకు గాను 44 చోట్ల టీడీపీ మద్దతుదారులు...