విధి నిర్వహణలో ఆర్డీఓ హరికుమార్ అప్రమత్తత
వినాయక నిమజ్జన ఏర్పాట్లను రాత్రివేళ పరిశీలన – సిబ్బందికి కీలక సూచనలు బాపట్ల, సెప్టెంబర్ 20 (పెన్ పవర్): విధి నిర్వహణే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ ప్రజా భద్రత, సౌకర్యాల కోసం ఆర్డీఓ హరికుమార్ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా బాపట్ల ప్రాంతంలో జరుగుతున్న వినాయక నిమజ్జన కార్యక్రమాల ఏర్పాట్లను ఆదివారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదర్శనగర్ కాలువ వద్ద ఏర్పాటు చేసిన శామియానాలు, లైట్లు వర్షం కారణంగా పడిపోయిన విషయాన్ని తనిఖీల్లో గుర్తించారు. వెంటనే సిబ్బందిని చరవాణి ద్వారా...