శ్రీ ఇందు కళాశాలలో ఘనంగా ముగిసిన 30 గంటల హ్యాకథాన్‌–2026

ఇబ్రహీంపట్నం, పెన్ పవర్, సెప్టెంబర్ 12: ఇబ్రహీంపట్నం మున్సిపల్ శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందు కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో నిర్వహించిన 30 గంటల హ్యాకథాన్‌–2026 శుక్రవారం, శనివారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ముందు నాలుగు రోజుల పాటు విద్యార్థులకు ప్రత్యేక బూట్‌క్యాంప్‌ నిర్వహించి ఆధునిక సాంకేతిక అంశాలపై శిక్షణ అందించారు. కళాశాల ఛైర్మన్‌ ఆర్‌. వెంకట్రావు, కార్యదర్శి ఆర్‌. అనుప్‌ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన హ్యాకథాన్‌లో సుమారు 450 మంది విద్యార్థులు పాల్గొని 92 ప్రాజెక్టులను రూపొందించారు. ఐడెంటిటీ ఏఐ, డేటా...