సాత్విక్ కుటుంబానికి గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ అండ

కూసుమంచి, పెన్ పవర్, సెప్టెంబర్ 10: తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం రఘునాథపాలెం మండలంలోని గురుకుల పాఠశాలలో గుండెపోటుతో మృతి చెందిన విద్యార్థి సాత్విక్ కుటుంబానికి అండగా నిలిచారు. బుధవారం గురుకుల పాఠశాలలో గుండెపోటుతో సాత్విక్ మృతి చెందిన విషయం తెలుసుకున్న అసోసియేషన్ ప్రతినిధులు కాకరవాయి గ్రామంలోని అతని కుటుంబాన్ని పరామర్శించారు. జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ సురభి మధు, జిల్లా జాయింట్ సెక్రెటరీ దండ లింగయ్య ఆధ్వర్యంలో సాత్విక్ కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. విద్యార్థి...