సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఉచిత హోమియోపతి మందుల పంపిణీ పర్చూరు, సెప్టెంబర్ 24, (పెన్ పవర్) : ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ సూచించారు. గురువారం ఉదయం పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వద్ద గ్రామస్తులకు ఉచిత హోమియోపతి నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దాసరి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా జలుబు, దగ్గు, విషజ్వరాలు వంటి వ్యాధులు...