స్థానిక ఎన్నికల్లో సామాజిక వర్గాల రాజకీయ భాగస్వామ్యం పెరగాలి

మహాకూటమిగా ఏర్పడి పోటీకి సిద్ధం కావాలని పిలుపు బాపట్ల, సెప్టెంబర్ 20 (పెన్ పవర్): బాపట్లలోని ఎన్జీ హోమ్ హాల్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు, ఏఐబీఎస్పీ ఆధ్వర్యంలో రాజకీయ అవగాహన సదస్సు నిర్వహించారు. నాయకులు కాటి మార్కు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, సామాజిక వర్గాల రాజకీయ భాగస్వామ్యం, ప్రజా సంఘాల ఐక్యత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సదస్సులో బి. పరంజ్యోతి మాట్లాడుతూ ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు, కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో...