స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట భద్రత
రౌడీషీటర్లు, పాత నేరస్థులపై నిరంతరం పర్యవేక్షణ: ఎస్పీ ఉమామహేశ్వర్ చీరాల, సెప్టెంబర్ 27 : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. చీరాల మున్సిపాలిటీ పరిధిలోని అతి సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు ఆదివారం చీరాల సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని ఎస్పీ సందర్శించారు. అనంతరం చీరాల మున్సిపాలిటీ పరిధిలోని పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి...