28, 29వ వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చీరాల, సెప్టెంబర్ 23, (పెన్ పవర్) : చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 28, 29వ వార్డుల్లో 15వ ఆర్థిక సంఘ నిధులతో రూ.17.05 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. చీరాల పట్టణంలోని ప్రతి వార్డులో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని...