7, 8 వార్డుల్లో నూతన సీసీ రోడ్లకు శంకుస్థాపన
బాపట్ల, సెప్టెంబర్ 30 : పట్టణంలోని 7, 8 వార్డుల పరిధిలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ రాజు బుధవారం శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మందపాటి ఆంద్రెయ, మాజీ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, 7వ వార్డు ప్రెసిడెంట్ కేసన వీర...